ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తార స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా బ్యారేజీలు నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడి మంత్రులు కూడా షర్మిల అన్నయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డిని తీవ్రంగా దూషిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు చేలరేగుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందించారు.
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని ఆమె పేర్కొన్నారు. అందుకు అవసరం అయితే ఎవరితో అయినా పోరాడటాని కైనా సిద్ధమన్నారు. ”తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. దీంతో ఏపీ, తెలంగాణ రాజకీయాలు మరింత వేడేక్కాయి. నీటి వివాదంపై వైఎస్ షర్మిల తెలంగాణ తరఫున మాట్లాడటంపై ఏపీ నాయకులు ఎలా స్పందిస్తారో ఇక చూడాల్సిందే.
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం..
అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..https://t.co/Kc6F1vkpLW— YS Sharmila (@realyssharmila) June 28, 2021