తెలంగాణ రాజకీయాల్లో ఏదో సాధించాలనే పట్టుదలతో ఎంట్రీ ఇచ్చిన షర్మిలకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆమె తప్ప అసలు ఆ పార్టీలో చెప్పుకోదగ్గ పెద్ద లీడర్ ఎవరూ కూడా లేరు. ఇదే షర్మిలకు పెద్ద సమస్యగా మారింది. ఇంకోవైపు ఆమె మీద ఆంధ్రా ముద్ర పడటం, తన అన్నతో సన్నిహితంగానే ఉంటుందన్న విమర్శలు కూడా ఆమెను జనాల్లోకి తీసుకెళ్లట్లేదు. ఇక పోతే పార్టీ పెట్టినప్పటి నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. అడ్ హక్ కమిటీలప్పుడే చాలామంది రాజీనామాలు చేయగా ఇప్పుడు మరింత మంది చేస్తున్నారు.
ఇక ఆమె పార్టీలో షర్మిల తర్వాత నిన్న మొన్నటి వరకు ఎంతో కీలకంగా వ్యవహరించిన ఇందిరా శోభన్ కూడా ఇప్పుడు రాజీనామా చేయడం పెదద్ దెబ్బే. ఎందుకంటే మిగతా వారంతా కూడా పెద్ద చెప్పుకోదగ్గ లీడర్లేమీ కాదు. అలాంటి వారు రాజీనమాలు చేసినా పెద్దగా నష్టమేమీ ఉండదు. కానీ నిత్యం షర్మిల వెంటే తిరిగిన ఇందిరా శోభన్ రాజీనామా మాత్రం చాలానే ఎఫెక్ట్ చూపిస్తోంది షర్మల పార్టీపై. షర్మల తర్వాత ఎవరైనా చెప్పుకోదగ్గ నాయకురాలు ఉన్నారంటే అది ఇందిరా శోభన్ మాత్రమే. కానీ ఇప్పుడు ఆమె కూడా రాజీనామా చేయడం పెద్ద సమస్యగా మారింది.
షర్మిల చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుని తెలంగాణలో ఎలా వ్యవహరించాలో సర్మిలకు దగ్గరుండి సలహాలు ఇస్తూ ఎంతో యాక్టివ్‌గా పనిచేశారు ఆమె. ఇక అలాంటి కీలక నాయకురాలు వెళ్లిపోవడంతో ఇకముందు ఎవరైనా ఆమె పార్టీలో చేరేందుకు కూడా వెనకాముందు ఆలోచిస్తారు. ఇందిరా శోభన్ ఎఫెక్ట్ తో అసలు పార్టీలో ఉన్న కొద్ది మంది కూడా ఉంటారా అనే అనుమానం కలుగుతోంది. ఈ సమస్య షర్మిలకు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెస్తోంది. రాబోయే రోజుల్లో షర్మిల పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.