ఆయనో మాజీ కేంద్ర మంత్రి, రాజకీయంగా ఆయన చూడని ఎత్తులు లేవు, చిత్తులు లేవు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రత్యర్ధులకు చుక్కలు చూపించారు. ముగ్గురు ప్రధానులతో దాదాపు ఆరుగురు కాంగ్రెస్ అధ్యక్షులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎం చెప్తే అదే జరుగుతుంది. ఆయన చెప్పిన వారికి రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుంది. అంత సమర్ధత ఉన్న నేత ఆయన.
ఆయన ఎవరో కాదు కమల్ నాథ్… ప్రస్తుత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. రెండు నెలల క్రితం ఆయన ప్రధాని నరేంద్ర మోడితో ప్రధాని కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. ప్రధానితో మాట్లాడినంత సేపు కూడా ఆయన అదే విధంగా ఉన్నారు. ఆయనను చూసి కాంగ్రెస్ నాయకులు షాక్ అయ్యారు. ఇప్పుడు దేశం మొత్తం ప్రధాని అంటే భయపడే పరిస్థితి. అలాంటి ప్రధాని ముందు ఆయన అలా కూర్చోవడం బిజెపి కూడా తట్టుకోలేకపోయింది.
అందుకే ఇప్పుడు ఆయనను పదవి నుంచి దించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి మొదలయింది. ఆయనను టార్గెట్ చేసిన బిజెపి అధిష్టానం ఎమ్మెల్యేలను కర్ణాటక తరలిస్తుంది. సరిహద్దున ఉన్న ఉత్తరప్రదేశ్ కు తరలిస్తుంది. దీనితో కమల్ నాథ్ ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఎం చెయ్యాలో అర్ధం కాక ఆయన అవస్థలు పడుతున్నారు. త్వరలోనే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు కూడా అంటున్నారు. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి.