వారం రోజ‌ల పాటు మౌన వ్ర‌తం – ప్రకాశ్ రాజ్‌

-

తాను వారం రోజుల పాటు మౌన వ్రతం చేస్తున్నాని విల‌క్ష‌న న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ అన్నాడు. ఇప్ప‌డే డాక్ట‌ర్ల‌తో హెల్త్ చెకప్ చేసుకున్నాను.. ప్ర‌స్తుతం తాను అవేశం తో ఊగిపోతున్నాన‌ని అన్నాడు. అయితే తాను వారం రోజ‌లు పాటు మౌన వ్ర‌తం లో ఉంటున్న‌ట్టు తెలిపాడు. ఈ స‌మ‌యంలో రాజ‌కీయం గా ఎవరినీ ఏమీ అన‌ను అన్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌కాశ్ రాజ్ న‌టించిన జై భీమ్ సినిమా పై ఒక వ‌ర్గానికి చెందిన వారు ప‌లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాకుండా హీరో సూర్య పై చిత్ర బృందం పై దాడి చేస్తామ‌ని కూడా ప్ర‌కటించారు. అలాగే వీరిని కొట్టిన వారికి రూ. ల‌క్ష బ‌హుమానం కూడా ప్ర‌క‌టిస్తామని కొన్ని సంస్థ‌లు, ఒక పార్టీ ప్ర‌క‌టించింది. అయితే జై భీమ్ సినిమా పై వ‌స్తున్న కామెంట్స్ పై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఇంత వ‌ర‌కు స్పందించ లేదు. దీంతో జై భీమ్ పై వ‌స్తున్న ఆరోపణ ల‌పై కౌంట‌ర్ ఇస్తున్న‌ట్టే ప్ర‌కాశ్ రాజ్ ఈ ట్వీట్ పెట్టాడ‌ని ప‌లువురు అంటున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించి ప‌లువురు కామెంట్ చేసినా.. ప్ర‌కాశ్ రాజ్ మౌనంగా ఉంటున్నాడు. అందుకే ప్ర‌కాశ్ రాజ్ మౌన వ్ర‌తం అని ట్వీట్ చేశాడ‌ని ప‌లువురు అంచనా వెస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version