సంచైత వెనక ఉండి టోటల్ స్టోరీ నడిపిస్తున్న వైకాపా నాయకుడు ఈయనే 

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్  సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌ పదవి విషయంలోనూ, మన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలోనూ వ్యవహరించిన తీరుపై మాజీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనని కాదని కూతురు సంచైత గజపతిరాజుని నియమించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ఈ విషయంలో కోర్టుకు వెళ్తానని కావాలని వైయస్ జగన్ నా పై కక్ష కట్టారని అశోక్‌ గజపతిరాజు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో బిజెపి పార్టీలో ఉన్న నాయకులు కూడా సంచైత గజపతిరాజుని సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌ పదవి విషయంలోనూ, మన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో నియమించడం దారుణమని పేర్కొన్నారు. కాగా హిందూ దేవాదాయ శాఖ కు సంబంధించిన ట్రస్ట్‌నీ అన్యమతస్థుల చేతుల్లో పెట్టడమేంటి.? అని అశోక్‌ గజపతిరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటం ఇప్పుడు సంచలనం సృష్టించింది.విషయంలోకి వెళితే స్వయానా అశోక్‌ గజపతిరాజు అన్న ఆనందగజపతిరాజు కుమార్తె. ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచైత. కానీ, ఇప్పుడు సంచైత పెంపుడు తండ్రి (సంచైత తల్లికి రెండో భర్త) క్రిస్టియన్‌. అదీ అసలు సమస్య. మరోపక్క సంచైత ‘నేను చర్చికి వెళ్ళినంతమాత్రాన క్రిస్టియన్‌నా.? మసీదుకి వెళ్ళినంతమాత్రాన ముస్లింనా.?’ అని సంచైత అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అశోక్ గజపతిరాజు కూడా గతంలో వెళ్లారు అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విషయంలో ఇంత రచ్చ అవ్వటానికి గల కారణం టోటల్ స్టోరీ నడిపిస్తున్న నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని కావాలని ఒక పద్ధతి ప్రకారం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న బలమైన నాయకులను వైసిపి నిర్వీర్యం చేస్తోందని కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version