పంజాబ్ సీఎంపై శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారని ఆరోపించారు. శనివారం మాన్తోపాటు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు.
Disturbing media reports quoting co-passengers say Pb CM @BhagwantMann was deplaned from Lufthansa flight as he was too drunk to walk. And it led to a 4-hour flight delay. He missed AAP's national convention. These reports have embarrassed & shamed Punjabis all over the globe.1/2 pic.twitter.com/QxFN44IFAE
— Sukhbir Singh Badal (@officeofssbadal) September 19, 2022
“మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారు. దీని వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైంది. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయారు. ఈ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బందిపడేలా చేశాయి. అయితే.. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాల్చింది. అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలి. పంజాబ్ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే.. ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి” అని ట్వీట్ చేశారు బాదల్.