తాండూరు బిగ్ ఫైట్..ఈ సారి ఎటువైపు?

-

తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలున్నాయి. వాటిలో తాండూర్ కూడా ఒకటి. గత ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 12 మంది బిఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అలా వెళ్ళిన వారిలో తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచి బిఆర్ఎస్ లోకి వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డి ఒకరు. ఈ సారి బిఆర్ఎస్ తరుపున తాండూర్ నుంచి పైలెట్ రోహిత్ ని తమ అభ్యర్థిగా ప్రకటించారు.

అటు కాంగ్రెస్ మాత్రం గట్టి అభ్యర్ధిని పెట్టాలని చూస్తుంది. కచ్చితంగా రోహిత్ రెడ్డిని గెలవనివ్వకూడదు అని గట్టిపట్టుతో ఉంది. బలమైన అభ్యర్థిని వారికి పోటీగా నిలబెట్టి ఈసారి కూడా తామే విజయం సాధించాలి అని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. తాండూరులో కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారిలో ఇద్దరికీ  రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉండగా, ఒకరికి సీనియర్లు బట్టి విక్రమార్క, ఉత్తమకుమార్ రెడ్డి సపోర్ట్ ఉంది. బిఆర్ఎస్ వాళ్లు ముదిరాజ్ సామాజిక వర్గానికి  ఒక్క  టికెట్  కూడా ఇవ్వలేదు అనే అంశంపై చర్చలు నడుస్తున్న నేపద్యంలో, ముదిరాజ్ రమేష్ మహారాజ్ కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుపు తమదే అని రేవంత్ రెడ్డి లెక్కలు వేస్తున్నారు.

అలా కాకపోయినా రఘువీరా రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు . కానీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కి టికెట్ ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క అడుగుతున్నారు. ఇతను రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు స్థానికంగా మంచి పట్టు ఉన్న నాయకుడు ఇతనికి ఇస్తే ఖచ్చితంగా గెలవచ్చు అని చెబుతున్నారు. ఈ ముగ్గురులో ఎవరికి సీటు ఇస్తుందో చెప్పలేం.

కానీ ఒకరికి సీటు ఇస్తే మిగిలిన ఇద్దరు సహకారం కష్టమే. అటు రోహిత్ రెడ్డికి..ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పైకి సపోర్ట్ ఇస్తున్నారు. కానీ అంతర్గతంగా ఎంతవరకు సహకరిస్తారో చెప్పలేం. చూడాలి మరి ఈ సారి తాండూరు ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version