ఏపీలో ఉత్తరకొరియా తరహా పరిస్థితులు నెలకొన్నాయి : లోకేశ్‌

-

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరకొరియా తరహా పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ర్యాలీ చేపట్టాలని భావించారు. ఓ ఐటీ ఉద్యోగి కారులో వెళ్తుండగా ఆపిన పోలీసులు, అతని వాట్సాప్‌ను చెక్ చేస్తున్న ఓ వీడియోను లోకేశ్ పోస్ట్ చేసి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఉన్న శిబిరం వద్ద నాలుగు వైపులా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే కార్లను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. చంద్రబాబు సాఫ్ట్​వేర్ రంగానికి ఎనలేని సేవలు అందించారని. ఆయన ముందుచూపుతోనే తామంతా ఉద్యోగాలు సాధించామని స్థానిక ఐటీ ఉద్యోగులు వివరించారు. ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని. నిరసిస్తూ తామంతా ర్యాలీ చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఐటీ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు వివిధ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వచ్చి మహిళలు సంఘీభావం తెలుపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నుంచి వచ్చిన మహిళలు బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. అన్యాయంగా బాబుని అరెస్ట్ చేశారని ఆయన త్వరలోనే బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version