టార్గెట్ 90: కమలం ఓవర్ కాన్ఫిడెన్స్?

-

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే…తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి కమలనాథులు కష్టపడుతున్నారు…కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులువా? కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఈజీనా? అంటే కష్టమే అనే చెప్పాలి. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టడం అంత సులువు కాదు.

అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సైతం స్ట్రాంగ్ గానే ఉంది…అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలని దాటుకుని బీజేపీ అధికారం దక్కించుకోవాలి…ఆ రెండు పార్టీలని దాటి అధికారం దక్కించుకోవడం అనేది ఈజీ టాస్క్ కాదు. కానీ ఆ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేయడానికి కమలదళం కష్టపడుతుంది..ఇప్పటికే ఆ రెండు పార్టీలకు పోటీగా రాజకీయం నడుపుతుంది..అలాగే మధ్యలో ఉప ఎన్నికలు గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం బీజేపీకి అడ్వాంటేజ్ గా మారాయి…అలాగే కేంద్రంలో అధికారంలో ఉండటం బాగా ప్లస్ అవుతుంది..కేంద్రంలోని పెద్దల సపోర్ట్ తో తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు.

సరే బీజేపీ నేతలు అధికారం దక్కించుకోవడం కోసం బాగానే కష్టపడుతున్నారు..అయితే అధికారం దక్కుతుందా? లేదా? అనేది ప్రజల చేతుల్లో ఉంది. కానీ ప్రజలు ఎటు వైపు ఉన్నారనే విషయం క్లియర్ గా తెలియడం లేదు. ఎన్నికల సమయంలోనే వారు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో అర్ధమవుతుంది..ఇక ఈలోపే బీజేపీ నేతలు మాత్రం..ప్రజలు తమ వైపే ఉన్నారని బాగా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు…రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు.

అలాగే ప్రధాని మోడీ సైతం తెలంగాణలో అధికారంలోకి వచ్చే విషయంలో కాన్ఫిడెన్స్ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు…తాజాగా బండి సంజయ్, జి‌హెచ్‌ఎం‌సి కార్పొరేటర్లతో భేటీ అయిన మోడీ…తెలంగాణలో 80 నుంచి 90 సీట్లు గెలుచుకుంటామని చెప్పుకొచ్చారు. అసలు తిప్పికొడితే 50 సీట్లలో కూడా బీజేపీకి సరైన బలం లేదు..కానీ 90 సీట్లు వరకు గెలిచేస్తామని చెబుతారు..ఇలా చెప్పడం అంటే పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని ప్రత్యర్ధులు అంటున్నారు. చూడాలి మరి బీజేపీది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందో లేక కాన్ఫిడెన్స్ అవుతుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version