మైండ్‌గేమ్: వైసీపీకి టీడీపీ-జనసేన చెక్!

-

ఏపీ రాజకీయాల్లో పార్టీలు మైండ్ గేమ్ ఆడటం ఎక్కువైపోయింది. ముఖ్యంగా ప్రధానంగా వైసీపీ, టి‌డి‌పిలు మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి తమదైన శైలిలో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి మైండ్ గేమ్ ఏ స్థాయిలో ఆడిందో చెప్పాల్సిన పని లేదు. తమకు 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఆల్రెడీ 11 మంది పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారని టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడింది.

దానికి తగ్గట్టుగానే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు. మొత్తానికి ఈ గేమ్ లో టి‌డి‌పి గెలిచింది. అయితే అధికార వైసీపీ టి‌డి‌పి టార్గెట్ గా మొదట నుంచి మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది. ఎక్కడకక్కడ టి‌డి‌పికి చెక్ పెడుతూనే వస్తుంది. పదే పదే చంద్రబాబు పని అయిపోయిందని, కుప్పంలో ఇంకా గెలవరని, ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడిపోయి భూస్థాపితం కాబోతుందంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. దీనికి టి‌డి‌పి కౌంటర్లు ఇస్తూనే ఉంది.

అదే సమయంలో టి‌డి‌పి-జనసేన పొత్తుపై వైసీపీ ఆడే మైండ్ గేమ్ మామూలుగా లేదు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే వైసీపీకే నష్టమనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు పార్టీలు వేరుగా పోటీ చేయడం వల్లే వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్తితి కనిపించడం లేదు. రెండు పార్టీలు పొత్తులో పోటీ చేసేలా ఉన్నాయి.

అందుకే ఆ పొత్తుని చెడగొట్టడానికి వైసీపీ చూస్తుంది..దమ్ముంటే 175 స్థానాల్లో టి‌డి‌పి‌, జనసేన ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తుంది. అంటే సవాల్ తో రెచ్చిపోయి ఒంటరిగా పోటీ చేస్తే లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్. కానీ అది వర్కౌట్ కావడం లేదు. అందుకే టి‌డి‌పి, జనసేన నేతల పేరిట..తాము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పి వైసీపీ నుంచి ఫేక్ పోస్టులు వస్తున్నాయి. ఇక వీటిని కూడా టి‌డి‌పి, జనసేనలు తిప్పికొడుతున్నాయి. దీని వల్ల వైసీపీ మైండ్ గేమ్ పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version