హస్తిన కేంద్రంగా వ్యూహాలకు పదును పెడుతున్న వైసీపీ.. మా స్టాండ్ అదేనంటూ ప్రకటన..

-

ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది.. కేంద్రంలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా.. అందుకు తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి.. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై అందరి దృష్టి పడింది.. రెండు కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మొదలయ్యే ఈ సమావేశాల్లో తమ వ్యూహాలను అమలు చెయ్యాలని అటు బిజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి..

పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను సభ ముందు పెట్టడానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది.. ముఖ్యంగా వక్ప్ బోర్డు సవరణ బిల్లును మరోసారి లోక్ సభలో ప్రవేశపెట్టి.. నెగ్గించుకోవాలని బిజేపీ పట్టుదలతో ఉంది.. దీనిపై గతంలో అనేక వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి.. వైసీపీతో పాటు పలు పార్టీలు వ్యతిరేకించాయి.. కానీ కొన్ని సవరణల తర్వాత మళ్లీ సభ ముందుకు వస్తోంది..

ఈ బిల్లు నెగ్గాలంటే..ఎన్డీయే మిత్రుల పాత్ర ఎంతో కీలకం. ఈ క్రమంలో ఏపీలోని తెలుగుదేశం పార్టీ వైపు అందరి చూపు పడింది.. టీడీపీకి పదహారు మంది ఎంపీలున్నారు.. ఈ బిల్లుపై వీరి స్టాండ్ ఏంటనే చర్చ ఆసక్తకరంగా మారింది.. గత ఎన్నికల్లో ముస్లీం మైనార్టీలు టీడీపీకి మద్దతిచ్చారు. మైనార్టీ మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో ఈ బిల్లును వ్యతిరేకించాలని చంద్రబాబుకు వినతులు కూడా వెళ్లాయి.. దీంతో టీడీపీ స్టాండ్ ఏంటనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

ఈ బిల్లు టీడీపీకి ఒక అగ్ని పరీక్షగా మారింది.. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ..ఈ బిల్లును వ్యతిరేకిస్తే.. ప్రధాని మోడీకి శత్రువుగా మారే అవకాశముంటుంది.. దీంతో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.. మరో పక్క వైసీపీ పక్కా స్టాండ్ తో ముందుకెళ్తోంది.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు తాము పూర్తిగా వ్యతిరేకం అని విజయసాయిరెడ్డి చెబుతున్నారు..ముస్లీమ్స్ మేలుకోరే వ్యక్తి జగన్ అని.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుకు మద్దతు ఇవ్వమని ఆయన అంటున్నారు.. ప్రస్తుతం టీడీపీ స్టాండ్ ఏంటనేది ఇంట్రస్టింగ్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version