టీడీపీకి బిగ్ షాక్… జిల్లాల‌కు జిల్లాలే ఖాళీ…

-

అంతంత‌ మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ అవుతున్న టీడీపీని మరికొందరు నాయకులు వీడేందుకు సిద్ధమయ్యారు. అది కూడా పార్టీ కష్టకాలంలో ఉన్న టీడీపీనే అంటిపెట్టుకున్నవారు బయటకివెళ్లిపోతున్నారు. గ‌తానికి భిన్నంగా ఈ సారి టీడీపీలో జిల్లాల‌కు జిల్లాలే ఖాళీ కాబోతున్నాయి. ఉమ్మ‌డి నల్గొండ జిల్లాలో పార్టీ ముఖ్య నాయకురాలుగా ఉన్న పాల్వాయి రజనీకుమారి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో మంచి వాయిస్ ఉన్న నేతగా పేరున్న రజనీ రాజీనామా చేయడం, టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.

TDP Big Shock In Telangana

ఈమెతో పాటు జిల్లాలో పలువురు నాయకులు కూడా రాజీనామా చేశారు. మాదగోని శ్రీనివాస్ గౌడ్, సాధినేని శ్రీనివాస్ రావు, కడారి అంజయ్య తదితరులు పార్టీని వీడనున్నారు. ఇక వీరంతా ఈనెల 18న బీజేపీలో చేరబోతున్నారు. ర‌జ‌నీ కుమారి పార్టీని వీడే ఎఫెక్ట్ న‌ల్లగొండ‌, సూర్యాపేట‌, యాదాద్రి జిల్లాల్లో ప‌డ‌నుంది. ఈ మూడు జిల్లాల్లో ఓ మోస్త‌రు నాయ‌కులు అంద‌రూ బీజేపీలోకి వెళ్లిపోతున్నారు.

ఇక నల్గొండ జిల్లాలో పరిస్థితి అలా ఉంటే కొత్తగూడెం జిల్లాలో టీడీపీ మొత్తం ఖాళీ అవ్వనుంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర నేతలు ఈనెల 18న హైదరాబాదులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఆ పార్టీలో చేరుతున్నారు. గతంలో కోనేరు అమిత్ షాని కలిసి బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే 30 సంవత్సరాలు టీడీపీతో అనుబంధం ఉండటంతో కోనేరు పార్టీకి రాజీనామా చేసేటప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, కోనేరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీటు ఆశించారు. కానీ కాంగ్రెస్ తో పొత్తు ఉండటంతో ఆయనకి సీటు దక్కలేదు. అటు టీఆర్ఎస్ సీటు ఆఫర్ చేసిన ఆయన పార్టీ మారకుండా అలాగే ఉండిపోయారు. కానీ రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్ కనపడకపోవడంతో బీజేపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనా తెలంగాణ‌లో టీడీపీ ఇక స‌మాధి అయిపోవ‌డం ఖాయ‌మైపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version