ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో మర్కజ్ మసీదు సీన్ మొత్తం రివర్స్ చేసిందని చెప్పవచ్చు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారి కేసులు బయటపడక ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలావరకూ కరోనా వైరస్ అదుపులో ఉంది. ముఖ్యంగా విదేశీయులను కట్టడి విషయంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ కావడంతో వాళ్లు బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయగలిగారు.
మర్కజ్ మసీదు ప్రార్థనల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగింది అని అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని ఎక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కరోనా కేసుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం అన్నట్టుగా సులువుగా చెప్పేస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ గా ముస్లిం ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవడానికి మర్కజ్ నెంబర్ ని ప్రస్తావించకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇదే విషయాన్ని చాలా మంది పార్టీలో సీనియర్ రాజకీయ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.