ఏపీలో తిరుగులేని బలం ఉన్న నాయకుడు ఎవరంటే..జగన్ మోహన్ రెడ్డి పేరు కళ్ళు మూసుకుని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ బలమైన నాయకుడుగా ఉన్నారు. అలాంటి బలమైన నాయకుడుని ఢీకొట్టడానికి చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం ఇటీవల చంద్రబాబు జైలుకు వెళ్ళాక టిడిపి-జనసేన మధ్య ఉందని పవన్ ప్రకటించారు.
మరి పొత్తు ఉండటం వల్ల జగన్‌కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అంటే టిడిపి-జనసేన శ్రేణులు ఏమో జగన్‌కు మైనస్ అని, వైసీపీ శ్రేణులు జగన్‌కు ప్లస్ అని భావిస్తున్నారు. మరి ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందనేది క్లారిటీ లేదు. కాకపోతే మెజారిటీ ప్రజలు జగన్ ఒంటరిగా పోరాటం చేస్తున్నారనేది అర్ధం చేసుకుంటున్నారు. ఒక్క జగన్‌ని ఓడించడానికి అంతా కలుస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. 2014లో జగన్ ఒక్కడే..2019లో ఒక్కడే. 2024లో కూడా ఒక్కడే. ఓడినా..గెలిచినా జగన్ ఒక్కడే పోరాటం చేస్తారని చెప్పుకుంటున్నారు.
అది నిజమే అని చెప్పాలి. ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే జగన్ ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. అదే ఆయనకు అడ్వాంటేజ్. ఇప్పుడు సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ వైపే ప్రజలు ఉన్నారు. ఇప్పుడు టిడిపి-పొత్తు ఫిక్స్ అవ్వడం వల్ల వైసీపీకి స్వల్పంగా నష్టపోవచ్చు..కానీ ఆధిక్యం మాత్రం వైసీపీదే అని తెలుస్తోంది. పొత్తు వల్ల జగన్‌కు ప్లస్ అవుతుందే తప్ప..మైనస్ లేదు.
పైగా టిడిపి—జనసేన పొత్తులో ఓట్లు సరిగ్గా బదిలీ కాకపోతే వైసీపీకి ఇంకా లాభం. అందులో ఎలాంటి డౌట్ లేదు. మొత్తానికైతే టిడిపి-జనసేన పొత్తు జగన్‌ని మళ్ళీ గెలిపించే ఛాన్స్ ఉంది.