జీఎస్ఐ, నిపుణుల సలహా లేకుండా SLBC పనులు ఎలా ప్రారంభించారు? : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

-

SLBC టన్నెల్ పనులు GSI అధికారుల పర్మిషన్,నిపుణుల సలహాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రారంభించిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. SLBCలో నీళ్లు వస్తున్నాయని 2019-20 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని గుర్తుచేశారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం GSI వాళ్ళ సలహాలు, నిపుణుల సలహాలు తీసుకోకుండా పనులు ఎలా మొదలెట్టారని ప్రశ్నించారు. 4 సంవత్సరాల తర్వాత పనుల అంచనా వ్యయాన్ని పెంచి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. SLBC మీద రెండు వాగులు ప్రవహిస్తున్నాయని.. ఆ వాగుల నీళ్లు టన్నెల్ లో ఊరుతున్నాయని గత ప్రభుత్వం పనులు ఆపేస్తే 4 ఏళ్ల తర్వాత సలహా లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని, ఈ ప్రమాదం జరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, దీని వలన ప్రాజెక్టు మొత్తం ప్రమాదంలో చిక్కుకున్నదని పాయల్ శంకర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version