బ్రేకింగ్; ప్రభుత్వ ఉద్యోగిని చంపేస్తానన్న టీడీపీ సీనియర్…!

-

ఎప్పుడూ ఏదోక వివాదాల చుట్టూ తిరిగే టీడీపీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక ప్రభుత్వం ఉద్యోగిని ఆయన ఫోన్ లో బండ బూతులు తిట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఈవోపీఆర్డీ అప్పలనాయుడుని ఆయన ఫోన్ లోనే బెదిరించారు. నిధుల విషయంలో అప్పలనాయుడు కి ఫోన్ చేసి బెదిరించారు.

ఫోన్ ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించిన రవి కుమార్ అక్కడి నుంచి బూతులు అందుకున్నారు. నీకు ఒళ్ళు బలిసింది అంటూ బూతుల పురాణం మొదలుపెట్టారు. ఈవోపీఆర్డీ గా నిన్ను ఎవర్రా నియమించింది అని ఆగ్రహంగా మాట్లాడారు రవి. భూమిలో పాతేస్తా అంటూ ఈవోపీఆర్డీని రవి బెదిరించడం ఇప్పుడు కలకలం రేపింది. జూనియర్ అసిస్టెంట్ గాడివి నిన్నెవరురా ఎఫ్ఏసి చేసింది అంటూ ప్రశ్నించారు రవి.

ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ సరుబుజ్జిలి వస్తావు అంటూ కూన రవి హెచ్చరించారు. రాయవలస పంచాయితీ డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. డబ్బులు డ్రా చేస్తుంటే రావడం లేదని ఈవోపీఆర్డీ అప్పలనాయుడు చెప్పినా రవి వినలేదు. ఎందుకు రావడం లేదని ఈవోపీఆర్డీపై మండిపడ్డారు. మరోసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చి ఎత్తుకేల్తా అంటూ హెచ్చరించారు ఆయన. గతంలో కూడా ఒక ప్రభుత్వ అధికారిని ఇదే విధంగా హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version