చినబాబుకు తమ్ముళ్ళు జాకీలు..తాతని మించి.!

-

నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే వినుకొండలో పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ మాచర్లలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే లోకేష్ పాదయాత్ర అనుకున్న మేర హైలైట్ అవ్వడం లేదు. ఆఖరికి యెల్లో మీడియా కూడా పెద్దగా కవరేజ్ ఇవ్వడం లేదంటే..పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అదే జగన్ పాదయాత్ర చేసేటప్పుడు..ఆయన పాదయాత్ర సమయంలో ప్రతిరోజూ జరిగే అంశాలపై ప్రజలు మాట్లాడుకునే వారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పాదయాత్ర గురించి చర్చ జరిగేది. ఆయన ప్రజా సమస్యలు తెలుసుకునే విధానం ఆకట్టుకునేది. పవర్‌ఫుల్ స్పీచ్‌లు ఇచ్చేవారు. కానీ లోకేష్ పాదయాత్ర మొదట నుంచి పేలవంగానే సాగుతుంది. అనుకున్న మేర ప్రజా మద్ధతు కనబడటం లేదు. ఎక్కడకక్కడ నియోజకవర్గ ఇంచార్జ్‌లు పార్టీ కేడర్‌ని తీసుకొచ్చి బండి నడిపిస్తున్నారు. ఇరుకు రోడ్డులో అటు, ఇటు ఫ్లెక్సీలు కట్టేసి..మధ్యలో టి‌డి‌పి శ్రేణులని పెట్టి సభలు నిర్వహించేస్తున్నారు.

అంటే అలా పెడితే కెమెరాల్లో జనం ఎక్కువమంది కనబడతారనే భావనా తీసుకురావాలని చేస్తున్నారు. ఏదో రెండు మూడు నియోజకవర్గాల్లో తప్ప లోకేష్ సభలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే లోకేష్ పాదయాత్ర గురించి ప్రజలు కూడా పెద్దగా మాట్లాడుకోవడం లేదు. దీంతో లోకేష్‌ని హైలైట్ చేసేందుకు..ఏదో పాదయాత్రలో ఆయనకు దెబ్బలు తగిలాయని, ప్రజలతో మమేకమైపోతున్నారని చిన్న చిన్న వీడియోలని క్రియేట్ చేసి వదులుతున్నారు.

ఇక సభలకు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. అబ్బో అప్పటిలో ఎన్టీఆర్ రోడ్ షోలకు కూడా అంత జనం రాలేదని కానీ లోకేష్ సభలకు అంతకుమించి జనం వస్తున్నారని టి‌డి‌పి నేతలు జాకీలు వేసి మరీ చినబాబుని లేపుతున్నారు. తాతని మించిన మనవడు అని చెప్పుకుంటున్నారు. కానీ ఎలివేషన్స్ ఇచ్చిన ప్రజలు మాత్రం లోకేష్ పాదయాత్రని పెద్దగా పట్టించుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version