ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన కన్నుమూత

-

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి స్పందన హఠాన్మరణం చెందారు. రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం స్పందన బ్యాంకాక్ లో ఉన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. అయితే ఆదివారం అర్ధరాత్రి స్పందనకు గుండెపోటు రావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు.

స్పందన ఆకస్మిక మరణ వార్త ఆమె కుటుంబ సభ్యులను, బంధువులు, ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం తమను తీవ్రంగా కలచివేస్తుందంటూ విజయ్ సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సైతం విజయ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version