విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టిడిపి షాకింగ్ నిర్ణయం..

-

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.. ఈ ఎన్నికకు కూటమి దూరంగా ఉండబోతుందని టిడిపి చెబుతోంది.. నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారట.. పోటీ చేసేందుకు తగినంత బలం లేకపోవడంతో.. తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని భావనలో చంద్రబాబు ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటినుంచి కూటమినేతలు తర్జనభజన పడుతున్నారు.. పోటీ చేసే అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా మొదటి నుంచి టిడిపి నేతలకు స్పష్టత రాలేదు.. రెండు మూడుసార్లు భేటి అయినప్పటికీ.. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో.. దీనిపై చంద్రబాబు దృష్టి సారించారు..

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ తరఫున సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు.. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉంది.. గెలుపు ఇక లాంచడమే అనుకున్న సమయంలో.. తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండబోతుందన్న ప్రచారం ఆసక్తిని రేకెత్తించింది.. అందుకు తగ్గట్టుగానే మూడు దఫాలుగా కూటమినేతల భేటీ అయ్యారు.. పీలా గోవింద సత్యనారాయణ తో పాటు చక్రవర్తి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి.. వీరిద్దరి పేర్లను కూటమినేతలో చంద్రబాబు దృష్టిలో పెట్టారట.. అనుకున్నంత బలం లేకపోవడంతో.. పోటీకి దూరంగా ఉంటే హుందాగా ఉంటుందనే అభిప్రాయాన్ని చంద్రబాబు పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారట.. దీంతో పోటీకి దూరంగా ఉండాలని అభిప్రాయానికి టిడిపి వచ్చింది..

నామినేషన్ దాఖలకి చివరి రోజు కావడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసింది.. ఓటమి భయంతోనే సీఎం చంద్రబాబు నాయుడు పోటీ పెట్టేందుకు కూడా భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఒకవేళ తెలుగుదేశం పార్టీ బరిలో ఉంటే మాత్రం.. ఈ ఎన్నిక రసవత్తరంగా మారేదని.. చంద్రబాబు పోటీకి దూరం అవడంతో హెల్ది రాజకీయాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. మొత్తంగా గత కొద్ది రోజులుగా ఉప ఎన్నికపై జరుగుతున్న సస్పెన్స్ కు తెరపడింది

Read more RELATED
Recommended to you

Exit mobile version