హనుమకొండ జిల్లాలోని ప్రెస్ మీట్ లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేసారు. పేరుకే రుణమాఫీ కానీ 50% రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదని రైతులు అంటున్నారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక ఆంక్షలు విదిస్తున్నారు అని తెలిపారు ఈటల. గతంలో ఎవరూ రుణమాఫీ చేయనట్టు రేవంత్ కలరింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో 71 లక్షల మంది రుణం తీసుకుంటే 49 లక్షల మంది మాత్రమే రుణం తీసుకున్నారని రేవంత్ అన్నారు…కానీ 23 లక్షల మందికి రుణమాఫీ చేయడం లేదు.
రుణమాఫీ కానీ రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతు బంధు ఇస్తామని చెప్పి మోసం చేశారు….దీనిపై కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హామీల అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులకి ఇచ్చిన 4 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న అని పేర్కొన ఈటల హామీలు అమలు చేయకపోతే రైతులతో కల్సి ఉద్యమం చేస్తాం అని స్పష్టం చేసారు.