టిడిపికి బిగ్ షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీసీ నేత..

-

తెలుగుదేశం పార్టీకి ఒక్కొక్క బీసీ నేత దూరమవుతున్నారు.. టిడిపిలో బీసీలకు ప్రాధాన్యత లేదని కొందరు.. టిక్కెట్ ఇవ్వలేదని మరికొందరు సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి ఫ్యాన్ కిందకి చేరిపోతున్నారు.. తాజాగా వెంకటగిరి నియోజకవర్గ బీసీ నేత మస్తాన్ యాదవ్ చంద్రబాబుకి గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.. తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తారంటూ ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన పార్టీ వేయడం వెంకటగిరి టిడిపికి బిగ్ షాక్కుగా చెప్పుకోవచ్చు..

వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.. అయితే తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన మస్తాన్ యాదవ్ కు చంద్రబాబు మొండి చేయి చూపారు. యువగళం పాదయాత్ర లో అన్ని తానై నడిపించిన మస్తాన్ యాదవ్ కు టికెట్ ఇస్తామని అప్పట్లో నారా లోకేష్ హామీ ఇచ్చారట.. దీంతో ఆయన పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు..

వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని మస్తాన్ యాదవ్ భావించారు.. అయితే చంద్రబాబు మాత్రం తన సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయించి బీసీలకు వెన్నుపోటు పొడిచాడు.. దీంతో తీవ్ర మనస్థాపంతో మస్తాన్ యాదవ్ టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.. స్థానికంగా మస్తాన్ యాదవ్ కు బీసీల మద్దతు ఉంది.. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో చంద్రబాబు ఆయన్ని వాడుకొని వదిలేసారని టిడిపిలో టాక్ నడుస్తోంది.. మస్తాన్ యాదవ్ వైసీపీలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఇటీవల వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. అది రాజకీయ దుమారం రేపింది.. అయినా కూడా చంద్రబాబు మాత్రం టిక్కెట్ విషయంలో బీసీలకు అన్యాయమే చేశారు.. దీంతో మస్తాన్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేశారని.. వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని ఆయన అనుచరులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version