‘నాలో ఇంకా జోష్ తగ్గలే’.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుని కాస్ట్ డల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి తనదైన శైలీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలో ఏ మాత్రం జోష్ తగ్గలేదని. మునపటిలానే ఉన్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్ల ఓడిన ఈటల రాజేందర్ మల్కాజ్ గిరిలో ఎలా గెలుస్తాడన్నారు.

మల్కాజిగిరిలో మాకు తప్ప ఎవరికీ కేడర్ లేదని తనదైన శైలీలో వ్యాఖ్యానించారు పార్లమెంట్ మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి జోస్యం చెప్పారు. కాగా, ఇటీవల మలారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాలేజీలు కూలగొట్టడం.. మల్లారెడ్డి 18 యూనివర్శిటీలో, విద్యార్థుల నిరసన వంటి వివాదాలతో మల్లారెడ్డి కాస్త ఇబ్బంది పడ్డాడు. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెట్టారు మల్లారెడ్డి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version