నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో లేదో క్లారిటీ వచ్చేలా లేదు…నిజానికి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఉంటుందనే చెప్పొచ్చు…రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి…గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ అయింది…చాలాచోట్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది..అదే అప్పుడే టీడీపీ-జనసేన కలిసి ఉంటే..వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేవి…ఒకవేళ గెలవకపోయినా …కనీసం 60 సీట్ల వరకు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఉండేవి. కానీ విడిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాయి.
అయితే వచ్చే ఎన్నికల్లో ఆ తప్పు చేయకూడదని రెండు పార్టీలు భావిస్తున్నాయి..పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారు. కాకపోతే పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే ఇద్దరు తగ్గాలి…కానీ ఎవరికి వారు తగ్గేలా లేరు…ఇప్పటివరకు తాము తగ్గామని, ఈ సారి మీరు తగ్గండని పవన్ అంటున్నారు..పవన్ కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
అసలు బలమైన పార్టీగా ఉన్న తాము తగ్గడం ఏంటని టీడీపీ అంటుంది…ఒక్కశాతం ఓట్లు లేని బీజేపీనే..పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించడం లేదు…అసలు తాము ఎలా సీఎం సీటు ఇస్తామని జనసేన భావిస్తుందని, టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి…అవసరమైతే సింగిల్ గా పోటీ చేసి సత్తా చాటుతామని అంటున్నారు. జనసేన కలిస్తే కాస్త అడ్వాంటేజ్ అవుతుందనే విషయం నిజమే అని, కానీ జనసేన లేకుండానే అధికారం సాధించగలమని టీడీపీ అంటుంది.
ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళు సోలోగానే ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 16 సీట్లలో వైసీపీ 14 గెలిస్తే…టీడీపీ 2 గెలుచుకుంది…అయితే జనసేన ఓట్లు చీల్చడం వల్ల బందరు, పెడన, అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ సెంట్రల్, వెస్ట్, పెనమలూరు లాంటి సీట్లని టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి జనసేన లేకుండానే ఆ సీట్లలో తాము సత్తా చాటుతామని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు…ఒకవేళ జనసేన కలిస్తే భారీ మెజారిటీలు వస్తాయని, లేకపోయినా గెలవగలుతామని భావిస్తున్నారు.