జులై 4న ఏపీకి మోడీ.. ఎయిమ్స్‌ ప్రారంభోత్సవం..

-

తెలుగ రాష్ట్రాల్లో జాతీయ నాయకులు పర్యటనలు గట్టగానే జరుగుతున్నాయి. అయితే ఇటీవల రెండుసార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ.. తాజాగా ఏపీలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ.. జులై 4న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌ధాని అమ‌రావతి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరిలో నూత‌నంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్‌ను మోడీ ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌నలో మోడీ వెంట కేంద్ర మంత్రి శోభా క‌రంద్లాజే కూడా ఏపీకి రానున్నారు.

ఈ మేర‌కు కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ప్రధాని మోడీ ఏపీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలోనే ఇటీవ‌లే రాష్ట్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను కేంద్ర మంత్రి ప‌రిశీలించారు. అంతేకాకుండా ఆసుప‌త్రి నిర్మాణం మొత్తాన్ని ఆమె నిశితంగా ప‌రిశీలించారు. ఆమె ఇచ్చిన స‌మాచారంతోనే మోడీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైన‌ట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version