టీడీపీలో ప్ర‌కంప‌న‌లు… వైసీపీ ట‌చ్‌లో 16 మంది ఎమ్మెల్యేలు…!

-

ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీలోనే ఎవరు ఎవరిని నమ్మటం లేదు.. పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వెళ్ళిపోతారో ? అని  ఆ పార్టీ నేతలకే తెలియటం లేదు. నిన్నటి వరకు టిడిపికి వీర విధేయుడిగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏకంగా పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వంశీ చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా కూడా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన తక్కువ మంది ఎమ్మెల్యేల్లో వంశీ కూడా ఒకరు. చంద్రబాబు వంశీని ఎంత బుజ్జగించినా వంశీ మాత్రం పార్టీలో ఉండేందుకు ఎంతమాత్రం ఇష్టపడలేదు.

తాజాగా ఇప్పుడు వైసీపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన కామెంట్లు టీడీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో మొత్తం 16 మంది వైసీపీకి టచ్‌లో వున్నారంటూ నారాయణస్వామి బాంబు పేల్చారు. జగన్ చిన్న సైగ చేస్తే చాలు వారంతా వైసీపీలోకి చేరతారన్నది స్వామి ప్రకటన సారాంశం. పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలుండగా, వారిలో వల్లభనేని వంశీ తాను పార్టీకి, పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆల్‌రెడీ ప్రకటించారు.. ఇక ఇప్పుడు 22 మంది మాత్ర‌మే ఉంటారు.

ఇక వీరిలో కూడా అ మరో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు  సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు టిడిపి బలం 21 పడిపోతుంది. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ నుంచి రాజీనామా  చేసేందుకు కాచుకుని కూర్చుని ఉన్నట్టు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే టిడిపి బలం 15 కాస్త అటు ఇటుగా పడిపోతుంది.

ఓవైపు పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపు కాయటం,ఇటు తెలంగాణలో పార్టీని బతికించుకోవడం, ఏపీలో అధికారం కోసం బలమైన సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి తో ఫైట్ చేయడం లాంటి అంశాలతో చంద్రబాబు బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో నాయకులూ  పార్టీ మారడం అంటే టిడిపికి అది కోలుకోలేని ఎదురుదెబ్బ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version