నెల్లూరు రాజకీయం..వైసీపీపై టీడీపీ పైచేయి సాధిస్తుందా?

-

నెల్లూరు రాజకీయం: ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట.. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా..ఇక్కడ వైసీపీదే పైచేయి.గత రెండు ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ హవా నడుస్తుంది. జిల్లాలో 10 సీట్లు ఉంటే..2014లో వైసీపీ7, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. 2019లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇలా పది సీట్లు గెలుచుకున్న జిల్లాలో ఇపుడు వైసీపీ ఇబ్బందుల్లో ఉందని, నెక్స్ట్ ఇక్కడ టి‌డి‌పి హవా కొనసాగనుందని విశ్లేషణలు వస్తున్నాయి.

అసలు అక్కడ అలాంటి పరిస్తితులు ఉన్నాయా? నెల్లూరు లో వైసీపీపై టి‌డి‌పి పై చేయి సాధిస్తుందా? అంటే పైకి కనిపించడం టి‌డి‌పి జోరు పెరిగిందని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇటీవల పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరమయ్యారు. కీలక నేతలైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి బలమైన నేతలు వైసీపీకి దూరమయ్యారు. ఇక వీరు నెక్స్ట్ ఎన్నికల ముందు టి‌డి‌పి లో చేరి..పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

అయితే ఆ నేతలు టి‌డి‌పిలో చేరడం దాదాపు ఖాయమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో వారికి టి‌డి‌పిలో సీట్లు కూడా ఫిక్స్. కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ సీటు ఫిక్స్. ఇక ఆనం, మేకపాటికి ఏ సీట్లు ఇస్తారో చూడాలి. అలాగే నెల్లూరులో ఇంకా పలువురు వైసీపీ నేతలు టి‌డి‌పిలోకి వస్తారని, ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి పై చేయి సాధిస్తుందని అంటున్నారు.

నెల్లూరు సిటీ, రూరల్, కావలి, ఉదయగిరి, వెంకటగిరి లాంటి సీట్లలో టి‌డి‌పి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే అక్కడ లీడ్ టీడీపీకే అంటున్నారు. అయితే ఇదంటే టి‌డి‌పి వాళ్ళ అంచనా మాత్రమే. ఇప్పటికీ అక్కడ వైసీపీ ఆధిక్యమే ఉంది. ఏదో రెండు, మూడు సీట్లు మినహా మిగిలిన సీట్లలో వైసీపీ జోరు కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ కూడా నెల్లూరులో వైసీపీదే పైచేయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version