అరుదైన రికార్డు సృష్టించిన సారా అర్జున్..!

-

సారా అర్జున్ అనగానే ముందుగా మనకు విక్రమ్ హీరోగా నటించిన నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ వెన్నెల గుర్తుకువస్తుంది. సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత సులభం కాదు. అందులోనూ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో రాణించాలి అంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అయితే ఈమెకు మాత్రం చిన్న వయసులోనే దశ తిరిగిపోయిందనే చెప్పాలి. ఆరేళ్ళ వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రాలలో కూడా కనిపించిన ఈమె 2017లో విజయ్ చిత్రం దైవ తిరుమగల్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.

ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ ఖాన్ ఏక్ థీ దయాన్, ఐశ్వర్యారాయ్ జబ్బా సూపర్ స్టార్ వంటి చిత్రాలలో నటించి ఆ తర్వాత తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాలలో కూడా నటించింది.రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించిన సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. అంతేకాదు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ -1 లో ఐశ్వర్యారాయ్ పాత్రకు యువ నందినిగా నటించి అలరించింది.

ఈ క్యారెక్టర్ తో సారా అర్జున్ కు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పవచ్చు ఆ తర్వాత పార్ట్ 2 లో కూడా ఈమె మరింత అందంగా కనిపించింది. ఇదిలా ఉండగా సారా అర్జున్ 2023 నాటికి సుమారుగా రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నిలిచింది.ఇకపోతే పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై ఏకంగా రూ.800కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. అయితే ఈమె రాబోయే ప్రాజెక్టులో దళపతి విజయ్ సినిమాలో నటించిన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version