ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అడ్రస్ లేదు… కాంగ్రెస్ కు అందుకే ప్రస్ట్రేషన్: కేటీఆర్

-

కాంగ్రెస్ పార్టీ ప్రస్ట్రేషన్ ఏమిటో అర్థం కావడం లేదని… సభ, లోపల బయట కుసంస్కారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. మా పార్టీ అధినేత జన్మదిన వేడులకు జరుపుకుంటే.. మూడు రోజులు సంతాపదినాలు చేసుకోండని అనడం… నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని.. తెలంగాణ సాధించి నాయకుడు, సీఎంపై కుసంస్కారంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. నిన్నకాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదని..98 శాతం స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేకుంటే… బీజేపీ ఫలితాలు చూసే ఆస్పత్రికి వెళ్లాడని రాజ్ గోపాల్ రెడ్డి విమర్శిస్తారని ఇదా పద్ధతి అని ప్రశ్నించారు. అవినీతి అని గొంతు చించుకోవడం కాదని, మీరు అవినీతి గురించి మాట్లాడవద్దని… ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్ స్కామ్ ఇలా ఏ టూ జెడ్ వరకు స్కాంలకు పాల్పడిన పార్టీ మీదని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version