బలమైన అభ్యర్దుల వేటలో బిజేపీ.. వ్యూహాలకు పదును పెడుతున్న కమలం పార్టీ..

-

రాష్టంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పదవి కాలం ముగియనుంది.. దీంతో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది బిజేపీ.. ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు ఆ పార్టీ నుంచి చాలా మంది ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘ్ ఆశీర్వాదం ఉన్నవారికే ఎమ్మెల్సీ టిక్కెట్లు దక్కుతాయనే చర్చ పార్టీలో జరుగుతోంది..

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. వరంగల్, ఖమ్మం,నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. వచ్చే ఎడాది మార్చి 29తొ పదవి కాలం ముగియనుంది..ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుకోసం బిజపీ ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టింది.. అభ్యర్దుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తూ… వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. అన్ని పార్టీల కంటేముందుగానే అభ్యర్దులను ప్రకటించి.. ప్రచారం చెయ్యాలని తొలుతా బిజేపీ భావించింది.. కానీ వ్యూహం మార్చుకుని బలమైన అభ్యర్దులను అన్వేషిస్తోంది..

ఉత్తర తెలంగాణ పరిధిలోని గ్రాడ్యుయేట్ , ఉపాధ్యాయ స్థానాలకు బిజేపీలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. పట్టభద్రుల టిక్కెట్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ రావులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీ చేసిన సుగుణాకర రావు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కేంద్ర నాయకులతో టచ్ లో ఉన్నారనే టాక్ లోకల్ గా బలంగా వినిపిస్తోంది..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మామిడి సుధాకర్ రెడ్డి, అనంత రెడ్డి ప్రయత్నిస్తున్నారు.. కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ లో బిజేపీకి పట్టుంది.. ఈ స్థానాలకు తీవ్ర పోటీ ఉండటంతో.. అభ్యర్దుల ఎంపిక రాష్ట నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది.. అయితే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని.. త్వరలోనే అభ్యర్దులను ప్రకటించే ఆలోచనలో రాష్ట నాయకత్వం ఉందట.. అభ్యర్దులను ఎంపిక చేసి.. అగ్రనేతలకు పంపితే.. వారు పైనల్ గా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version