మంచు కుటుంబం వివాదంపై తొలిసారిగా స్పందించారు మంచు విష్ణు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మంచు విష్ణు.. తన ఫ్యామిలీలో కొనసాగుతున్న వివాదాలపై స్పందించారు. ప్రతి ఇంట్లో చిన్నపాటి గొడవలు ఉంటాయని.. ఈ విషయాన్ని పెద్దగా చిత్రీకరించవద్దని మంచు విష్ణు కోరారు.
త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కాగా, మోహన్ బాబు ఫిర్యాదు మేరకు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికపై కేసు నమోదు అయ్యింది. కాగా, మనోజ్ మీద తండ్రి మోహన్ బాబు దాడులు చేయించారని కథనాలు వస్తున్నాయి. మంచు విష్ణు సహచరుడు విజయ్ మనోజ్ ఇంటికి వెళ్లి దాడులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను తీసుకెళ్లిపోయాడని సమాచారం. ఇక అన్నదమ్ములు ఇద్దరు బౌన్సర్లను కాపాలాగా పెట్టుకున్నారని టాక్. దీనికి తోడు మోహన్ బాబు తన కొడుకు మనోజ్ మీద పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. మనోజ్ సైతం తనపై దాడులు చేశారని పహాడీ షరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ గొడవలన్నీమోహన్ బాబు జల్ పల్లిలో నిర్మించుకున్న విశాలమైన ఇంటి కోసమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.