పంజాబ్ పరిస్థితి తెలంగాణ రాకూడదు… కాంగ్రెస్ ఖతం అయింది: జగ్గారెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసమ్మతి చెలరేగుతోంది. సీనియర్లు పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. పీపీపీ ఛీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేఖిస్తున్నారు. ఒంటెద్దు పోకడలు పార్టీకి మంచివి కాదని సీనియర్లు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈరోజు సీనియర్లు మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో కాంగ్రెస్ కు వచ్చిన పరిస్థితి తెలంగాణకు రాకూడదని… పంజాబ్ లో సిద్ధూ వల్ల కాంగ్రెస్ పార్టీ ఖతం అయిందని ఆయన అన్నారు. పార్టీ మేలు కోసమే సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. నేను పార్టీ మారుతున్నానని హై కమాండ్ కు ఠాగూర్, రేవంత్ రెడ్డి చెప్పారని ఆరోపించారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఎవరూ కూడా నాకు చెప్పలేదని ఆయన అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర నాయకత్వంపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అన్ని విషయాలు చెప్తాం అని జగ్గారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version