మంత్రివర్గ రేసులో ఆ ఆరుగురే.. వారిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో..

-

తెలంగాణా క్యాబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది.. రేపో..మాపో విస్తరణ ఉంటుందని.. తమకు అవకాశం వస్తుందని ఆశావాహులు ప్రచారం చేసుకుంటున్నారు.. అధిష్తానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి లిస్ట్ ను తయారుచేస్తున్నారు.. సామాజిక సమీకరణాలతో పాటు.. విధేయతకు పెద్ద పీట వేస్తున్నట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది.. ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో.. ఎవరికి వారు విసృతంగా లాబీయింగ్ లు చేసుకుంటున్నారు..

కొందరు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యేలు.. మరికొందరు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులు.. ఇంకొందరు పాతతరం నేతలు వీరంతా క్యాబినెట్ విస్తరణ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. విస్తరణ జరిగితే.. తమకు మంత్రి పదవి ఖాయమనే భావనలో నేతలున్నారు.. తెలంగాణాలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. దీంతో పార్టీ కోసం పనిచేసిన వారు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.. తమకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని ఆశపడుతున్నారు..

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సమయంలో.. కొందరు సీనియర్లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఇప్పడు ప్రస్తుతం 12 మంది మంత్రులుగ కొనసాగుతున్నారు. మరొ ఆరుగురికి అవకాశం ఉంటుంది.. దీంతో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని గత రెండు నెలల నుంచి ప్రచారం జరుగుతుంది.. అందుకు తగ్గట్లుగానే సీఎం రెండు సార్లు డిల్లీకి వెళ్లారు.. జాబితాలో మార్పులు, చేర్పులు అధిష్టానం పెద్దలతో చర్చించారు.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. లిస్ట్ పైనల్ కు చేరుకుంది.. పీసీసీ నియామకం తర్వాత లిస్టు లో వేగం పుంజుకుంది..

సామాజిక సమీకరణాలతో పాటు.. అనుభవానికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది.. సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండేవారిని క్యాబినెట్ లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇదే విషయంపై రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించి.. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఒకరిరద్దరు కీలక నేతలను క్యాబినెట్ లో తీసుకోవాలని రేవంత్ సూచించారని సమాచారం.. అయితే మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, బాలూనాయక్, రామచంద్రునాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి ప్రముఖంగా ఉన్నారు.. వీరిలో నలుగురికి పదవులు ఖాయమనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.. ఆ నలుగురు ఎవరనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version