కేసీఆర్‌కు షాకింగ్ న్యూస్ ..ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం!

-

కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్రలో కొద్దిరోజుల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి బీఆర్ఎస్ నేతలు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మానిక్‌రావ్ సహా పార్టీ నేతలు మంగళవారం ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను కలవనున్నారు. అక్టోబర్ 6న పుణెలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో గులాబీ నేతలంతా ఎన్సీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో పరాజయం పాలయ్యాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.పార్టీ అధినేత సైలెంట్ కావడంతో ఆయా రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏపీలో పార్టీ శాఖ అధ్యక్షుడు మినహా కీలక నేతలంగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కథనాలు వస్తున్నాయి. గులాబీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఖాళీ అవుతుండటంతో కేసీఆర్ స్పందిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version