తిరుపతిని యూటీ చేయాలి..పవన్ ఒక క్రిస్టియన్ : కేఏ పాల్ హాట్ కామెంట్స్

-

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో ఈ వివాదంపై సీబీఐతో విచారణ జరపాలని కేసు వేసినట్లు పేర్కొన్నారు.తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం ఎందుకు చెయ్యకూడదని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రాన్ని,ప్రధానిని కలుస్తానని చెప్పారు. పవన్‌తో పాటూ పలువురు నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.

పవన్ ఏమన్నా మాట్లాడితే తాట తీస్తా..అంటాడు. తిరుపతిని యూటీ చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించాను. దొంగలే దొంగల్ని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయా? హైడ్రాపై రేవంత్ రెడ్డితోనూ మాట్లాడాను.వాటికన్ సిటిని ప్రత్యేక దేశంగా చేసినప్పుడు లక్షల కోట్ల భక్తులు ఉన్న తిరుపతిని ఎందుకు యూటీ ఎందుకు చెయ్యకూడదు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు.తెలంగాణలో హైడ్రాతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో తిరుమల వివాదంపై పిల్ వేశాను. చంద్రబాబు,పవన్ తిరుపతి లడ్డూ గురించి మాట్లాడొద్దు. సిట్ విచారణ కంటే సీబీఐ ద్వారా జరిపించాలి. లడ్డూలో కల్తీ జరగలేదు.రాజకీయ కుట్ర చేస్తున్నారు.నేను భారతీయున్ని,క్రీస్తు ఫాలోవర్‌ను..ప్రపంచ శాంతిని కోరుకుంటున్నా.హ్యుమానిటీ ముందు..మతం తర్వాత.చంద్రబాబు హిందువు కాదు, ఆయన నాస్తికుడు. దేవుళ్ళను నమ్మను, ప్రజలే నాకు దేవుళ్ళు అని చాలా సార్లు బాబు చెప్పాడు.పవన్ నేను క్రైస్తవున్ని అని చెప్పాడు. ఇపుడు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. తిరుమల లడ్డూ వివాదం దేశం దాటి విదేశాల్లోనూ చర్చ జరుగుతోంది అని కేఏ పాల్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version