త‌న‌కు ఆరోగ్య‌శాఖ ఇవ్వ‌డానికి కార‌ణం అదేన‌ట‌.. ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

-

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ‌లో ఎంత పెద్ద దుమారం రేపుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న బీజేపీలో చేరిన‌ప్ప‌టి నుంచి స్వ‌రం పెంచుతూనే ఉన్నారు. రోజురోజుకూ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో నిప్పుడు చెరుగుతూనే ఉన్నారు. ఇక తాజ‌గా మ‌రోసారి ఆయ‌న మాట‌ల తూటాలు పేల్చారు. రీసెంట్‌గా హుజూరాబాద్‌లో మారోసారి మాట్లాడారు.

కేసీఆర్ త‌న మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడు కానీ కేవ‌లం సామాన్య రైతుల‌కు ఎలా ఇచ్చాడంటూ ప్ర‌శ్నించారు. ఒక మామూలు మనిషి వచ్చి ఫిర్యాదు ప‌త్రం ఇవ్వగానే ఆయ‌న‌కు చెందిన టీవీలు, ప‌త్రిక‌ల్లో అబ‌ద్ధ‌పు ప్రచారం చేయించాడ‌ని వ్యాఖ్యానించారు.

ఇదే సంద‌ర్భంగా త‌న‌కు మొద‌ట్లో మంత్రి పదవి రాదని కేసీఆరే స్వంయ‌గా ఆయ‌న పత్రికలో రాయించార‌ని ఆరోపించారు. అలాగే త‌న‌కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయిస్తే ప్ర‌తిరోజూ నెగిటివ్ వార్తలు, ప్ర‌జ‌ల నుంచి త‌న‌పై విమ‌ర్శ‌లు వస్తాయనే కార‌ణంతోనే ఆ శాఖ‌ను ఇచ్చార‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. కానీ కాలం క‌లిసి వ‌చ్చిన త‌న‌ను ప్ర‌జ‌లు ఆద‌రించార‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version