ఆ జిల్లాలు సేఫ్ అవ్వడం వెనక అంత పెద్ద కారణం ఉందా ?

-

ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల విషయం బయట పడక ముందు, దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా వైరస్ కట్టడి చేయడంలో చాలా కట్టుదిట్టంగా వ్యవహరించింది అంటూ జాతీయ స్థాయి మీడియా ఛానల్స్ అభినందించాయి. ఎక్కడికక్కడ గ్రామ వాలంటీర్ల తో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందే విదేశీ అడ్రస్ లను కనుక్కునీ వాళ్లని ఇంటికే పరిమితం చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా అద్భుతంగా వ్యవహరించిందని ఏపీ ప్రభుత్వం పై పొగడ్తల వర్షం అంతటా కురిసింది.అయితే ఎప్పుడైతే ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లిన వారిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు బయట పడటంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతకు ముందు వరకు ఎటువంటి కేసులు నమోదు గాని జిల్లాలలో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఆయా జిల్లాల ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అన్ని జిల్లాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి కానీ శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం తో, ఆ రెండు జిల్లాలు సేఫ్ జోన్ లో పడ్డాయి.

 

అసలు ఈ రెండు జిల్లాల లో వైరస్ వ్యాప్తి చెందకుండా పెద్ద కారణమే దాగి ఉంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే రెండు జిల్లాలకు కూడా కొంతమంది ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చినా వారెవరికీ కరోనా లక్షణాలు లేవు, అక్కడితో సంతృప్తి చెందకుండా.. జిల్లా కలెక్టర్లు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. విదేశాలనుంచి వచ్చినవారందర్నీ పక్కాగా క్వారంటైన్ కి పరిమితం చేశారు. అంతేకాకుండా రెండు జిల్లాల కలెక్టర్లు పిల్లలకు సంబంధించి సరిహద్దులను మూసివేశారు. దీంతో పాటుగా ఢిల్లీ తబ్లిగి జమాత్ కి వెళ్లినవారి సంఖ్య  చూస్తే శ్రీకాకుళంలో 0 అయితే విజయనగరంలో చాలా తక్కువ. దీంతో రెండు జిల్లాలలో కరోనా వైరస్ ఎఫెక్ట్ లేకపోవటంతో ఆ రెండు జిల్లాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ టైములో పక్క రాష్ట్రం ఒడిశాలో కూడా కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడం ఆ రెండు జిల్లాలకు కలిసొచ్చిన అంశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version