ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి మందు కొనుక్కోడానికి ప్రపంచ దేశాలు తలకిందుల అవుతున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు మరియు దేశాలు బాగా డబ్బులు ఖర్చు చేస్తున్నా ఒకపక్క ప్రయత్నాలు ప్రయోగాలు జరుగుతున్న ఇప్పటివరకు ఒక శుభవార్త కూడా వినపడలేదు. ఇటువంటి తరుణంలో అంతా ఓకే అయితే ముందుగా ప్రపంచంలో ఆస్ట్రేలియా శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్నా ఈ వైరస్ ఆస్ట్రేలియాలో కూడా తన ప్రభావం చూపుతుంది.
ఇందులో భాగంగా యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్ట్, ఇన్వియో ఫార్మాసూటికల్స్ తయారుచేసిన వాక్సిన్ తొలి క్లినికల్ ట్రయల్స్ కు అనుమతినిచ్చింది. ఆ తరువాత వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తమకే అనుమతి లభించిందని సీసిరో ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. సో మొత్తం ట్రైన్స్ పూర్తయితే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఆస్ట్రేలియా శుభవార్త చెప్పబోతోంది అంటూ అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.