ఆ ఎమ్మెల్యే అభ్యర్ధి అంటే చాలు అమ్మాయిలు పడి చస్తారు…!

-

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఎన్నికలు దగ్గరకు రావడంతో రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని ఆప్ ప్రయత్నాలు చేస్తుండగా ఎలాగైనా సరే ఢిల్లీలో గెలిచి నిలబడాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. అటు కాంగ్రెస్ కూడా కోల్పోయిన ఓటు బ్యాంకు ని తిరిగి పొందడానికి గాను aవ్యూహాలని సిద్దం చేస్తుంది.

ఇదిలా ఉంటే ఆప్ ఎమ్మెల్యే అభ్యర్ధికి ఇప్పుడు అమ్మాయిలు ఫిదా అయిపోయారు. ఆయన ఆ పార్టీకి స్టార్ ప్రచారకర్తగా ఉన్నారు. రాఘవ్ చాధా తన ప్రచారం సందర్భంగా ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి రాజకీయ నాయకుడు అయిన ఛాదా… కోసం అమ్మాయిలు పడిచస్తున్నారు. ఆయన రజిందర్ నగర్ నుండి ఎన్నికల్లో పోటీ పడుతున్నాడు. ఎన్నికల్లో విజయం కోసం భారీగా రోడ్ షో లు కూడా చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అయితే ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన తమను పెళ్లి చేసుకోవాలని కొందరు అమ్మాయిలు విజ్ఞప్తి చేసారు. సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతుంది. “ఇటీవల, ఒక మహిళ తనను ట్విట్టర్లో ట్యాగ్ చేసింది, తనను వివాహం చేసుకోమని కోరింది. ఆర్థిక వ్యవస్థ బాగా లేదు కాబట్టి వివాహం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని చాదా చెప్పారు” అతని సోషల్ మీడియా మేనేజర్ ఒకరు చెప్పారు.

ఇటీవల ఆయన ఒక స్కూల్ కి వెళ్ళారు. ఈ నేపధ్యంలో ఈ 31 ఏళ్ళ ఎమ్మెల్యే అభ్యర్ధిని ఒక టీచర్… నాకు అమ్మాయి ఉంటే, మీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని అని వ్యాఖ్యానించారు. అది చూసి చాధా షాక్ అయ్యారు. ఇక మరో అమ్మాయి అయితే సోషల్ మీడియాలో “దయచేసి పెళ్లి చేసుకోకండి … నేను గుండెలు బాదుకుంటాను” అని కామెంట్ చేసారు. దక్షిణ ఢిల్లీ నుంచి గత ఏడాది పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version