తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ చేయనుంది. తెలంగాణాలో కేసులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో హైకోర్ట్ సీరియస్ గా వ్యవాహరిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై రాష్ట్ర సర్కార్ నేడు నివేదిక ఇవ్వనుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పిస్తారు. కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ విధించామని కోర్టుకు ప్రభుత్వం వివరిస్తుంది.
కేసులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ పై కోర్టు సంతృప్తి చెందుతుందా లేక లాక్ డౌన్ మాట ఏమైనా మాట్లాడుతుందా అనేది అర్ధం కావడం లేదు. గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిపై కూడా విచారణ జరగనుంది. ఇక ఈ విచారణకు డీజీపీ కూడా హాజరు అవుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇస్తారు. మాధ్యాహ్నం నాటికి స్పష్టత రానుంది.