హోంగార్డు హత్య.. చంపింది ఎవరో కాదు..?

-

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో ఏకంగా భర్తను హత్య చేసింది భార్య. నెక్కొండ మండలం లోని గేటు పల్లికి చెందిన ధుర్యంత్ సింగ్.. వరంగల్ ట్రాఫిక్ హోంగార్డుగా పని చేస్తున్నాడు. అయితే టైలరింగ్ షాపు నిర్వహిస్తున్న భార్య జ్యోతికి రాజు అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది.

చివరికి ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక ఓ రోజు ఇది నిజం భర్తకు తెలియడంతో తీరు మార్చుకోవాలంటు భార్యను హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో భర్తనే అడ్డం తొలగించుకోవాలని ప్రియుడు రాజుతో కలిసి ప్లాన్ చేసి.. దారుణంగా భర్తను హత్య చేసింది భార్య. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version