తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశం నేడు తొలి రోజు ను పూర్తి చేసుకుంది. ఈ రోజు ఐదు తీర్మాణాలను కార్యవర్గం ఆమోదించింది. రాజకీయ, రైతుసమస్యల తో పాటు దళిత బందు, ధరణి, నిరుధ్యోగం వంటి సమస్యల పరిష్కారినికి పోరాటం చేయాలని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అధికార పార్టీ పై విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తో నే తెలంగాణ ముఖచిత్రం మారుతుందని అన్నారు. ఓటమి ని జిర్ణించు కోలేక నే బీజేపీ పై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
కాగ ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ల ను కూడా ఉంచారు.
ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ తో పాటు అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిదులు పెంచాలని అన్నారు. టీఆర్ఎస్ మాఫియా చేతుల్లోనే ఇసుక మైనింగ్ ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మాఫియా లపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒకే విడతలో రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. అలాగే వ్యవసాయం గురించి కూడా పలు డిమాండ్ లను ప్రభుత్వం ముందు ఉంచారు. ధరణి వెబ్ సైట్ ను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ని అమలు చేసి బకాయిలతో సహా చెల్లించాలని అన్నారు.