రేపు టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ స‌మావేశం

-

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్ల‌మెంట్ స‌భ్యు ల‌తో రేపు పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి గులాబీ బాస్ సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. రేపు ఉద‌యం 11 గంట‌ల నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఈ స‌మావేశం జ‌ర‌గనుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు హాజ‌రు కానున్నారు. అయితే పార్ల‌మెంటు ఉభ‌య స‌భలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి.

అయితే టీఆర్ఎస్ ఎంపీ లో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహం పై గులాబీ బాస్ కేసీఆర్ ఎంపీ ల‌కు దిశా నిర్ధేశం చేయ‌నున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప్ర‌ధాన మైన స‌మ‌స్య గా యాసంగి వ‌డ్ల కొనుగులు అంశం ఉంది. దీని పై కేంద్రం అవ‌లంభిస్తున్న వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. అలాగే వ‌రి ధాన్యం కొనుగోలు అంశం పై పార్లమెంట్ ఉభ‌య స‌భ‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌ని అనే అంశం కూడా చర్చించుకునే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version