ధాన్యం సేక‌రించాల్సిన బాధ్య‌త రాష్ట్రానిదే – జీవ‌న్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో వ‌రి ధాన్యాన్ని సేక‌రించాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయ‌కుడు జీవ‌న్ రెడ్డి అన్నాడు. చివరి గింజ వరకు నేనే కోంట అని గొప్పలు చెప్పిన కెసిఆర్… ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదు అంటున్నారని విమ‌ర్శించాడు. కేంద్రం తెచ్చిన ప్ర‌తి బిల్లు కు కేసీఆర్ మ‌ద్ద‌త్తు ఇవ్వలేదా.. అని ప్ర‌శ్నించాడు. మోడీ మెడలు వంచుతా అన్న కేసీఆర్ ఇప్పుడు త‌న మెడ‌లే వంచుతున్నార‌ని విమ‌ర్శించారు.

ఇప్ప‌డు వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యం లో ముఖ్య మంత్రి కేసీఆర్ కు క‌నీసం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కూడా కోర‌లేద‌ని అన్నారు.
. ప్రధాని అప్పాయింట్ మెంట్ కూడా కోరలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కు రైతు స‌మ‌స్య‌ల పైన చిత్త శుద్ధి లేద‌ని అన్నారు. ఒక వేల కేసీఆర్ కు రైతుల ప‌ట్ల చిత్త శుద్ధి ఉంటే ఢిల్లీ లో ని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాల‌ని అన్నారు. తెలంగాణ లో ధాన్యం సేక‌రణ గురించి ఒక్క సారి అయినా జిల్లా ల కలెక్టర్ లతో మాట్లాడారా అని ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version