విదేశీ ప్రయాణిలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 15 నుంచి రెగ్యులర్ ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కరోనా పాండమిక్ తర్వాత నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. అయితే ఇటీవల పలు దేశాల్లో కరోనా తీవ్రత తక్కువ కావడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో కేంద్రం ఇంటర్నేషనల్ సర్వీసులను ప్రారంభించనుంది. ఇటీవల కేంద్రం మంత్రి జ్యోతిరాాధిత్య సింథియా కూడా డిసెంబర్ నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తామమని వెల్లడించారు.
ఇదిలా ఉంటే 14 దేశాలకు మాత్రం విమానాలు నడపడం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ఈ దేశాల్లో కరోనా తీవ్రత పెరగడంతోపాటు కొత్త వేరియంట్లు బయటపడటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, చైనా, మారిషస్, న్యూజిలాండ్ ,జింబాబ్వే దేశాలను కరోనా హైరిస్క్ ఉన్న దేశాల జాబితాలో చేర్చడంతో ఈ 14 దేశాలకు అంతర్జాతీయ విమానాలను నడపడం లేదు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, జింబాబ్వే దేశాల్లో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. అక్కడ కేసుల సంఖ్య కూడా పెరగుతుంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాల్లో కూడా కరోనా తీవ్రత అధికంగా ఉంది. దీంతో ఆ దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.