ఎంత తిట్టుకున్నా వాళ్ళే స్పూర్తి .. వాళ్ళదే ఆరోగ్య కీర్తి !

-

చైనా దేశంలో వూహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ప్రమాదకరమైన వైరస్ వల్ల చాలామంది దేశాన్ని పరిపాలించే ప్రధానులు అధ్యక్షులు కూడా బలైపోతున్నారు. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా దేశాలు లాక్ డౌన్ అమలులోకి తీసుకు వచ్చాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగాలు లేక ఆహారం లేక పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా చైనా దేశాన్ని వూహాన్‌ నగరంలో ప్రజలను బండ బూతులు తిడుతున్నారు.ముందుగా ఈ వైరస్ చైనాలో వూహాన్‌ నగరంలో బయటపడటంతో వైరస్ ని అరికట్ట లేక చైనా ప్రభుత్వం వూహాన్‌ నగరంలో లాక్ డౌన్ విధించింది. ఈ పరిణామంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వూహాన్‌ నగరం నుండి ఇతర ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి వూహాన్‌ నగరం కి రాకపోకలను చైనా ప్రభుత్వం ఆపేసింది. దీంతో బస్సులు రోడ్లు విమానాలు అన్నీ కూడా మూలనపడ్డాయి. జనవరి నెల నుండి ఏప్రిల్ ప్రారంభం వరకు వూహాన్‌ నగరంలో లాక్ డౌన్ కొనసాగింది. ప్రజలంతా లాక్ డౌన్ కి సహకరించడంతో పూర్తిగా ఇప్పుడూ ఆ ప్రాంతంలో కరోనా వైరస్ ని అరికట్ట గలిగారు. దీంతో తాజాగా ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ ని ఎత్హేసింది. దీంతో భయం భయం తో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో ఉన్న ప్రజలు… ఆనందంతో వీధుల్లోకి వచ్చి కేరింతలు వేశారు.

 

బస్సులు మరియు ఇతర వాహనాలు కూడా రోడ్లపైకి వచ్చాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చని… ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మరియు మాస్కులు ధరించండి అంటూ చైనా ప్రభుత్వం ప్రజలకు షరతులు విధించింది. ఇక్కడ చూడాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ వల్ల ముందుగా అనేక మరణ కేకలు విన్న  వూహాన్ ప్రజలు అక్కడ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించడంతో… పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోగలిగారు. అలాగే మనం కూడా లాక్‌డౌన్‌ను వ‌జ్ర‌సంక‌ల్పంతో పాటిస్తే అతి త్వ‌రలో వూహాన్‌లో మాదిరిగా స్వేచ్ఛా వాయువుల‌ను పీల్చుకోవ‌చ్చు. ఎంత తిట్టుకున్నా గాని కరోనా తో వూహాన్‌ ప్రజల పోరాటం విషయంలో వాళ్ళే స్పూర్తి .. వాళ్ళదే ఆరోగ్య కీర్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version