గద్వాల్ త్రిముఖ పోరు..కానీ ట్విస్ట్ అదే.!

-

గద్వాల్..ఈ పేరు చెబితే…మొదట గుర్తొచ్చే పేరు డీకే అరుణ..అక్కడ చెరగని ముద్రవేసిన నాయకురాలు. గద్వాల్ అంటేనే డి‌కే ఫ్యామిలీ కంచుకోట. 1957 నుంచి ఇక్కడ డి‌కే ఫ్యామిలీ జోరు కొనసాగుతూ వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చిన..ఎక్కువ విజయాలు డి‌కే ఫ్యామిలిదే. డి‌కే సత్యారెడ్డి, డి‌కే సమరసింహారెడ్డి, డి‌కే భరతసింహారెడ్డి..ఇక 2004 నుంచి డి‌కే అరుణ గెలుస్తూ వచ్చారు. వరుసగా మూడుసార్లు గెలిచారు.

2018 ఎన్నికల్లోనే ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బి‌ఆర్‌ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. ఓడిపోయాక ఆమె బి‌జే‌పిలోకి వెళ్లారు. ఇక ఇటీవల ఎమ్మెల్యే బండ్ల ఎన్నికల ఆఫడవిట్ లో తప్పులు నేపథ్యంలో..ఆయనపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో రెండోస్థానంలో నిలిచిన డి‌కే అరుణని ఎమ్మెల్యేగా ప్రకటించారు. కాకపోతే ఇంకా ప్రమాణస్వీకారం చేయించలేదు. అయితే దీనిపై ఎమ్మెల్యే బండ్ల సుప్రీంని ఆశ్రయించారు. ఆ విషయం పక్కన పెడితే..మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి సత్తా చాటాలని ఆమె చూస్తున్నారు.

బి‌జే‌పి నుంచి డి‌కే అరుణ పోటీ చేయడంలో ట్విస్ట్ ఉంది..డి‌కే అరుణ మహబూబ్‌నగర్ అసెంబ్లీ బరిలో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు గద్వాల్ లో డి‌కే అరుణ కుమార్తె పోటీ చేయవచ్చనే ప్రచారం కూడా ఉంది. ఇక ఎవరు పోటీ చేసిన గద్వాల్ బరిలో విజయం అనేది డి‌కే అరుణకు కీలకం. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి మళ్ళీ బండ్ల పోటీ చేయనున్నారు.

ఇక డి‌కే అరుణ కాంగ్రెస్ వదిలేశాక..ఆ పార్టీ వీక్ అయింది. అయితే ఇటీవల బి‌ఆర్‌ఎస్ జెడ్‌పి చైర్‌పర్సన్ సరిత కాంగ్రెస్ లోకి వచ్చారు. దీంతో ఆ పార్టీకి ప్లస్ అయింది. ఈ క్రమంలో గద్వాల్ లో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రధానంగా బి‌జే‌పి, బి‌ఆర్‌ఎస్ మధ్యే పోటీ ఉండే ఛాన్స్ ఉంది. అలా కాకుండా డి‌కే అరుణ గాని కాంగ్రెస్ లోకి వస్తే..ఇంకా బి‌జే‌పి సైడ్ అయినట్లే. చూడాలి మరి గద్వాల్ లో ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version