ఏపీ రాజకీయాల్లో పొత్తు విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీ..జనసేనని కలుపుకుంటే ఫలితం ఉంటుందని భావిస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్తితుల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాంగ్‌గా ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలంటే టీడీపీ బలం సరిపోదు. జనసేన సపోర్ట్ తీసుకుంటే కాస్త యూజ్ ఉండొచ్చు.
అసలు టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు సైతం బీజేపీతో కలవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. కాకపోతే జనసేన కలిస్తే బాగానే ఉంటుందనే కోణంలో టీడీపీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. అంటే టీడీపీకి జనసేన కావాలి…బీజేపీకి జనసేన కావాలి. ప్రస్తుతానికి బీజేపీతో మాత్రం జనసేన కలిసి ఉంది…ఒకవేళ టీడీపీతో కలవాలంటే బీజేపీకి బ్రేకప్ చెప్పాల్సిందే.
కానీ బీజేపీ నేతలు మాత్రం జనసేన విషయంలో కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. జనసేన తమతోనే ఉంటుందని అనుకుంటున్నారు. అయితే తాజాగా పవన్ పొత్తు విషయంలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నామని, సమయాన్ని బట్టి పొత్తుల గురించి ఆలోచిద్దామని జనసేన నేతలకు సూచించారు. అంటే ఇక్కడ టీడీపీ పొత్తు వద్దు అని మాత్రం చెప్పలేదు. దీని బట్టి చూస్తే భవిష్యత్‌లో టీడీపీతో పొత్తు ఉండే ఛాన్స్ ఉంది. మరి చూడాలి చివరికి జనసేన ఏ పార్టీతో కలుస్తుందో చూడాలి.