పుంగనూరులో బాబు ఎత్తులను చిత్తు చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి.. ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా..

-

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని ప్రముఖ పార్టీల నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి బరిలో ఉంటున్నారు.. ఆయన ఎదుర్కొనేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. చల్లా బాబుని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఇక్కడ రాజకీయాలు మారిపోయాయని టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వచ్చే ఎన్నికల్లో నిలువరించేందుకు టిడిపి చేస్తున్న వ్యూహాలను పెద్దిరెడ్డి తిప్పి కొడుతున్నారట. పెద్దిరెడ్డినీ ఓడించి తిరుగుతానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని.. అది అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయం కోసం పుంగనూరు ఘటనను వాడుకున్నారని.. టిడిపి నేతలను రెచ్చగొట్టి వైసిపి శ్రేణులపై ఉసిగొల్పారని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమనీ కేసుల్లో చంద్రబాబు ఇరికించారనే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారట.. దీంతో పుంగనూరు ఘటన తరువాత టిడిపి నేతల్లో ఐక్యత లోపించింది. చల్లా బాబు మాత్రమే తన వర్గంతో ప్రచారాలు చేస్తున్నారు తప్ప టిడిపి కేడర్ ఎక్కడ అతనికి సపోర్ట్ చేయట్లేదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.

మరోపక్క బీసీ నేత రామచంద్ర యాదవ్ సైతం ఈసారి బరిలో ఉండబోతున్నారట. ఆయన కూడా పోటీ చేస్తే బీసీ ఓట్లను ఛీల్చేసే చేసే అవకాశాలు ఉన్నాయని.. అది వైసీపీకి లబ్ధి జరుగుతుందని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ ఖాయమని పెద్దిరెడ్డి ప్రకటనలు చూస్తున్న దాన్ని తిప్పి కొట్టే నాయకులు నియోజకవర్గంలో లేకపోవడం తమ పార్టీ దౌర్భాగ్యం అని.. సొంత క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుందట.. ఇవన్నీ పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఈసారి కూడా పుంగనూరులో వైసీపీ దే హవా అని చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version