ప్రస్తుతం హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ ఎస్ అన్నట్టు రాజకీయాలు జోరు మీద ఉన్నాయి. అక్కడ సీఎం కేసీఆర్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఈటల రాజకీయాలకు చెక్ పెట్టే పనిని కేవలం కొందరికే ఇస్తున్నారు గులాబీ బాస్. స్పష్టంగా చెప్పాలంటే ఈటలకు సన్నిహితంగా ఉంటున్న హరీశ్‌రావు లాంటి వారినే రంగంలోకి దింపారు. ఇప్పటికే ఈ పనులను వేగవంతం చేస్తున్నారు.
ట్రబుల్ షూటర్ హరీశ్‌రావుకు ఇందులో భాగంగా కీలక బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్. హుజూరాబాద్ రాజకీయాలకు మంత్రి హరీశ్ రావును ఇన్‌చార్జిగా పెట్టి చక్రం తిప్పుతున్నారు. హుజూరాబాద్ జనాలకు టీఆర్ ఎస్ నాయకుతు వరాలు కురిపిస్తున్నారు. ఏది కావాలన్నా వెంటనే సాంక్షన్ చేస్తున్నారు.
ఇప్పటికే హుజూరాబాద్‌లోని ప్రతి ఊర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టేస్తున్నారు. పిఛన్ కావాలన్నా, కొత్త రేషన్‌కార్డు కావాలన్నా, రోడ్లు కావాలన్నా వెంటనే సాంక్షన్ చేస్తున్నారు. రూల్స్ పక్కన పెట్టి మరీ ఏది కావాలన్నా స్పెషల్ కేటగిరీ కింద ఇస్తున్నారు. ఎలాగైనా ఈటలపై గెలిచి పార్టీ పరువు నిలుపుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు నిత్యం అక్కడే మకాం వేస్తున్నారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారో.