TRS vs BJP : టీఆర్ఎస్ సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడి ఇంటిపై బీజేపీ కార్య‌కర్తల దాడి.. కారు ధ్వంసం

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నియోజ‌క వర్గం రాజ‌న్న సిరిసిల్లా జిల్లాలో శుక్ర‌వారం రాత్రి హైడ్రామా నెల‌కొంది. టీఆర్ఎస్ సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు తొట ఆగ‌య్య ఇంటిపై బీజేపీ కార్య‌క‌ర్త‌లు కర్ర‌ల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న సిరిసిల్లా జిల్లాలోని ఎల్ల‌రెడ్డిపేట్ మండ‌లంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో టీఆర్ఎస్ సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు తొట ఆగ‌య్య కారు ధ్వంసం అయింది. ఈ దాడి ఘ‌ట‌న‌పై కరీంనగ‌ర్ మంత్రి గంగుల క‌మాల‌క‌ర్ తీవ్రంగా స్పందించారు.

ఈ రోజు ఎల్ల‌రెడ్డిపేట్ కు మంత్రి గంగుల క‌మాల‌క‌ర్, ఎమ్మెల్యేలు ర‌స‌మ‌యి బాల‌కృష్ణ, సుంకే ర‌వి శంక‌ర్ రానున్నారు. కాగ శుక్ర‌వారం రోజు టీఆర్ఎస్ – బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాట్స‌ప్ లో జ‌రిగిన సంభ‌షణ వివాదానికి దారి తీసింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వ‌ర‌కు చేరుకుంది. కాగ శుక్ర‌వారం రాత్రి టీఆర్ఎస్ – బీజేపీ కార్య‌కర్తలు ఎల్ల‌రెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్క‌డ పోలీసులు ఇరు వ‌ర్గాల‌ను శాంతింప చేయ‌గా.. త‌ర్వాత‌.. బీజేపీ కార్య‌క‌ర్తలు ఎల్ల‌రెడ్డిపేట్ లో ఉన్న టీఆర్ఎస్ సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు తొట ఆగ‌య్య ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆగ‌య్య కారు ధ్వంసం అయింది. కాగ నేడు మంత్రి ఘ‌ట‌నా స్థ‌లానికి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version